సీనియర్ హీరోస్ అంటే ఎక్కువగా అందరికీ హీరోలకి హీరోయిన్లకి తండ్రి పాత్రలు లేదంటే లీడ్ పాత్రలో ఇలానే ఊహించుకుంటూ ఉంటారు . కానీ మన ఇండస్ట్రీలో హీరోలు మాత్రం సీనియర్ హీరోస్ అంటే హీరోసే.  అది 20 ప్లస్ 30 ప్లస్ 50 ప్లస్ అయినా ఆఖరికి 60 ప్లస్ అయినా.. ఏజ్ ఎలా మారిన తమ డెసిగ్నేషన్ మాత్రం మారకూడదు అనుకునే టైప్. మరీ ముఖ్యంగా చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - నాగార్జున ఇప్పటికి ఇండస్ట్రీలో హీరోలుగా నటిస్తున్నారు.  చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ పెద్ద హీరో అయినా చిరంజీవి ఇప్పటికీ హీరోగా నటిస్తున్నారు .


ఇక బాలకృష్ణ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . నాగార్జున ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చేశారు.  వెంకటేష్ కొడుకు కూడా రేపో మాపో  అన్నట్టే ఉన్నారు. అయినా సరే వీళ్ళు మాత్రం హీరోలు గానే సినిమాలను ఓకే చేస్తున్నారు . కానీ ఇప్పుడిప్పుడే చిరంజీవి - నాగార్జున ఆ రూట్ నుంచి బయటికి రాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కే  సినిమాలో చిరంజీవి  - ప్రభాస్ కి  తండ్రి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అన్న న్యూస్ ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.



ఇప్పుడు నాగార్జున కూడా ఒక హీరోయిన్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.  అక్కినేని నాగార్జున కూడా తండ్రి పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట . ఇప్పటివరకు అలాంటి కథలు వినిపిస్తే రిజెక్ట్ చేసారు నాగార్జున . ఇప్పుడు క్యారెక్టర్ మంచిదైతే సీనియర్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అంటూ ముందుకు వెళ్తున్నారట. మరి ముఖ్యంగా ఇప్పుడు నాగార్జున తండ్రిగా ఫస్ట్ సినిమాని ఓకే చేశాడు అంటూ బయటికి వచ్చింది న్యూస్. కోర్టు మూవీతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీదేవికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట అక్కినేని నాగార్జున . కోర్టు మూవీ తర్వాత శ్రీదేవికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న శ్రీదేవి  కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట నాగార్జున..!

మరింత సమాచారం తెలుసుకోండి: