టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరో మెగాస్టార్ చిరంజీవి అంటే దర్శక నిర్మాతలని ఒక రేంజ్‌లో శాసించే స్థాయిలో ఉన్నారు. ఏ టెక్నీషియ‌న్ అయినా వ‌ద్దు అనుకుంటే క్ష‌ణాల్లో ఆ సినిమా నుంచి చిరు త‌ప్పించేస్తారు. చిరు స్థాయి అది. ఇక ఈ త‌రం హీరోలు అంద‌రికి చిరు ఓ రోల్ మోడ‌ల్‌. వ‌రుస‌గా చిరు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. అయినా కూడా చిరు వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట్ అవుతున్నారు. చిరు సినిమాల‌కు మ్యూజిక్ అంటే ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. చిరు డ్యాన్సుల కోసం సంగీత ద‌ర్శ‌కులు సైతం కొత్త ట్యూన్లు కంపోజ్ చేస్తూ ఉంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే లిరిక్స్ కూడా ర‌చ‌యిత‌లు ఇస్తూ ఉంటారు. ఇక కొరియోగ్రాఫ‌ర్లు అయితే చిరు బాడీ మూమెంట్ కు త‌గ్గ‌ట్టుగా స్టెప్పులు కంపోజ్ చేస్తూ ఉంటారు.


చిరు పాట అంటే అంత బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. అలాంటిది రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఓ సంద‌ర్భంలో చిరు సినిమా లో 6 పాట‌ల‌కు కేవ‌లం 6 ట్యూన్లే పంపించాడ‌ట‌. చిరు సినిమా అంటే లెక్క‌లు వేరుగా ఉంటాయి. ఆప్ష‌న్లు వేరుగా ఉంటాయి. ప‌ది నుంచి 15 ట్యూన్లు పంపిస్తేనే వాటిలో నాలుగు లేదా అయిదు ట్యూన్లు ఫైన‌ల్ చేస్తారు. కానీ ఆ టైంలో దేవి శ్రీ ఫుల్ బిజీ.. క‌థ విన్న త‌ర్వాత అన్నయ్య సినిమా అంటే ఇలాగే ఉండాల‌ని ఫిక్సై కేవ‌లం 6 ట్యూన్లు మాత్ర‌మే పంపార‌ట‌.


అయితే చాలా మందికి దేవికి ఇంత పొగ‌రు ఏంట‌నుకున్నార‌ట‌. కానీ అవి విన్నాక‌ ఒక్క ట్యూన్ కూడా రిజెక్ట్ చేసేలా లేదని చిరంజీవి శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్ సినిమా ఆడియో ఫంక్షన్ లో అందరి ముందు ఒప్పుకున్నారు చిరంజీవి ... దటీజ్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అన‌క త‌ప్ప‌దేమో..!


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: