సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లుగా పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది నటన, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక హీరోయిన్లుగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో నటి నిధి అగర్వాల్ ఒకరు. ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటగా తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది అనేక సినిమాలలో హీరోయిన్ గా చేసి సక్సెస్ సాధించింది. హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక తెలుగులో సవ్యసాచి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 

ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో వరుసగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

 వరుసగా ఫోటో షూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఈ చిన్నది సినిమాలలో అవకాశాల కోసం తన గ్లామర్ డోస్ పెంచుతూ తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఇదిలా ఉండగా.... ఈ చిన్నది తాజాగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకోగా అది సంచలనంగా మారింది. సినిమాలలో అవకాశాల కోసం తాను ఎంత కష్టమైనా భరిస్తానని చెప్పింది. అంతేకాకుండా సినిమాలలో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్రలోనైనా తప్పకుండా నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈ చిన్నది షేర్ చేసుకున్న ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: