
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా 1998 - 2001 వరకు సిమ్రాన్ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో నటించింది. అసలు 2001 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు .. ఇద్దరూ పెద్ద హీరోలు చిరు, బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మృగరాజు - నరసింహా నాయుడు రెండు సినిమాల్లోనూ ఆమే హీరోయిన్. అప్పట్లో ఆమె క్రేజ్ అలా ఉండేది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె తాజాగా వార్తల్లోకి వచ్చింది. నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే బెటర్ అంటూ ఆమె మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లను ఉద్దేశించి తాజాగా సిమ్రాన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. నా తోటి నటి నన్ను ఉద్దేశించి చేసిన కామెంట్లు చాలా బాధ పెట్టాయని .. ఆ బాధతోనే ఇటీవల అవార్డుల ఫంక్షన్ లో నాకు అనిపించింది తాను చెప్పానని అన్నారు.
ఇక కెరీర్ స్టార్టింగ్ నుంచి అప్పుడప్పుడు ఆంటీ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నాను’ అని సిమ్రాన్ అన్నారు. అలా చేయడంలో తప్పే ముందని .. ఆ రోల్స్ నాకు ఇష్టం.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఎప్పటకీ స్నేహితులు కాలేరని.. నాకు ఎదురైన అనుభవంతోనే మరోసారి ఇది ఫ్రూవ్ అయ్యిందని సిమ్రాన్ చెప్పారు. స్నేహితులు అనుకునే వాళ్లే కొన్నిసార్లు చేసే కామెంట్ల తో మనం ఎంతో బాధపడతాం ? అని ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్ చేసింది. నేను ఏమీ ఇబ్బందిపడలేదు కానీ, ఆమెతో అంతకుముందు ఆమెతో ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదని సిమ్రాన్ చెప్పింది. దీంతో ఇప్పుడు సిమ్రాన్‌ను అంతలా బాధపెట్టిన ఆ హీరోయిన్ ఎవరా ? అన్న చర్చలు మీడియా సర్కిల్స్‌లో బాగా నడుస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు