టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి ప్రియా వడ్లమాని ఒకరు. హుషారు సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమాలో తనదైన నటన, అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది.


అంతే కాకుండా ఈ సినిమాలో తన అందాలను ఆరబోసి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో కొన్ని సినిమాలలో మాత్రమే నటించి గుర్తింపు పొందింది. తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తూ తన కెరీర్ ను సాఫీగా కొనసాగిస్తోంది. ఇక సినిమాలలో అవకాశాలు రానప్పటికీ పలు వెబ్ సిరీస్ లలోను నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలను పొందింది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.


తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.... అవి విపరీతంగా వైరల్ గా మారుతాయి. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి.


ఈ క్రమంలోని ప్రియాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ భామ బయట ఎక్కడికో వెళ్లిన సమయంలో కొంతమంది ఈమెను ఫోటోలు, వీడియోలు తీశారు. అందులో ప్రియ చాలా లావుగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన కొంతమంది అది ఎడిటింగ్ వీడియో అనే కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ భామ నిజంగానే లావు అయిందని అంటున్నారు. దీనిపై ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: