టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయనకు ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం సినిమాతో భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్న ఈయన ఆ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తో కూడా అలాంటి రిజల్ట్ నే సొంతం చేసుకున్నాడు. తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ కి సంబంధించిన టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఎన్ని కోట్ల నష్టాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.


టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 75 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.60 కోట్ల షేర్ ... 10.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 85 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 6.90 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 28.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 21.60 కోట్ల నష్టాలను అందుకొని భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: