అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన తాజా చిత్రం పుష్ప-2. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ఒక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా విమర్శలపాలు కూడా అయింది. పుష్ప-2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

అత్యంత ఎక్కువ కలెక్షన్ రాబట్టిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఇక డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో ను నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అక్కడికి అల్లు అర్జున్ ను చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. డిసెంబర్ 4వ తేదీ నుంచి శ్రీ తేజ్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇక చాలా రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న శ్రీ తేజ్ డిశ్చార్జ్ అయ్యాడు.

కొద్ది రోజుల నుంచి శ్రీ తేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడని గత 15 రోజుల నుంచి నోటి నుంచి లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నారని శ్రీ తేజ్ తండ్రి వెల్లడించాడు. కానీ శ్రీ తేజ్ ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదని చెప్పాడు. స్టెబుల్ గా ఉంటున్నారని శ్రీ తేజ్ తండ్రి వెల్లడించాడు. శ్రీ తేజ్ కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించారని వెల్లడించాడు. ఇక శ్రీ తేజ్ ఆసుపత్రి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ అల్లు అర్జున్ భరించాడు. అయినప్పటికీ ఆ బాబు ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదని కొంతమంది ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీ తేజ్ కోలుకోవడానికి మరికొన్ని రోజులు సమయం పట్టేలా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: