నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్లో అనేక విజయాలు ఉన్నాయి. అలా బాలకృష్ణ కెరియర్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన సినిమాలలో సింహ మూవీ ఒకటి. ఈ మూవీ లో నయనతార , స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చక్రి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ 2010 వ సంవత్సరం ఏప్రిల్ 30 వ తేదీన విడుదల అయ్యి ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విజయవంతంగా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి ఆ సమయంలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 7.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 7.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఉత్తరాంధ్రలో 3.43 కోట్లు , ఈస్ట్ లో 1.69 కోట్లు , వెస్ట్ లో 1.76 కోట్లు , గుంటూరులో 3.70 కోట్లు , కృష్ణ లో 1.99 కోట్లు , నెల్లూరు లో 1.42 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 28.81 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో ఈ మూవీ కి 2.83 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 31.64 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 18.7 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 12.94 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని ఆ సమయంలో సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: