
బాక్స్ ఆఫీస్ వద్ద రెట్రో చిత్రానికి భారీ రెస్పాన్స్ రావడంతో.. తన నుంచి రూ.10 కోట్ల రూపాయల విరాళంగా ప్రకటించారు హీరో సూర్య. ఈ మేరకు ఈ విషయం తెలిసిన అభిమానుల అభినందనలతో ప్రశంసిస్తున్నారు. స్వయంగా హీరో సూర్య ఈ చెక్కుని ఆగరం ఫౌండేషన్ కు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. 2006 లో ఈరోజు సూర్య ఆగరం అనే ఫౌండేషన్ ని స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనాధ పిల్లలకు చదువులకు పేద పిల్లల చదువులకు కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా అందిస్తుందట.
అయితే ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకొని చాలామంది విద్యార్థులు కూడా ప్రయోజకులు అయ్యారు. హీరో సూర్య రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని కూడా పేరు సంపాదించారు నిరంతరం సామాజిక సేవలలో తన భార్య జ్యోతిక తో సామాజిక సేవలలో పాల్గొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు సూర్య. తన సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వర్ష సినిమాలతో నటిస్తూ ఉన్న సూర్య. ఇటీవలే రెట్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.