
అంతేకాదు కోలీవుడ్లో రెండు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తరకెక్కుతున్న రామాయణ సినిమాలో నటిస్తుంది . కాగా రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . సాయి పల్లవి చాలా చాలా టాలెంటెడ్ యాక్టర్ . అంతే కాదు ఆమె తీసుకున్న డెసిషన్ కి కట్టుబడి ఉంటుంది. కాగా హీరోయిన్ సాయి పల్లవి మిస్ చేసుకున్న ఒక సినిమా డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సాయి పల్లవి తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద సినిమా అయినా రిజెక్ట్ చేస్తుంది అన్న సంగతి అందరికీ తెలుసు .
కాగా చిరంజీవితో కూడా ఆమె సినిమా రిజెక్ట్ చేసింది . భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో ముందుగా సాయి పల్లవి ని అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది . అంతేకాదు ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లియో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ ముందుగా సాయి పల్లవి కి వచ్చిందట. కానీ ఆమెకు ఈ పాత్ర నచ్చలేదట . ఈ పాత్ర నచ్చకపోవడం కారణంగానే ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. తనకు తాను చేసే పాత్ర సంతృప్తికరంగా ఉంటేనే ఆమె సైన్ చేస్తుందట . పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే తన పాత్ర సంతృప్తికరంగా లేకపోతే అది ఎన్ని కోట్లు బడ్జెట్ సినిమా అయినా రిజెక్ట్ చేస్తుందట . తాజాగా లియో సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా ఛాన్స్ రిజెక్ట్ చేసింది అన్న వార్త సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ గా మారింది..!