నటుడు బ్రహ్మాజీ విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ అటు నటుడిగా.. ఇటు కమెడియన్ గా.. నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన ఏ పాత్రలో కనిపించినా సరే, ఆ పాత్రకు తగ్గట్టుగా నటిస్తారు. బ్రహ్మాజీ ఎంతో సహజ నటుడు. ఈయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బ్రహ్మాజీ సింధూరం సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.

అంతకు ముందు బ్రహ్మాజీ నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించారు. అలాగే రవితేజ నటించిన ఖడ్గం సినిమాలో.. మహేష్ బాబు నటించిన అతడు మూవీలో కూడా కనిపించారు. ఏక్ నిరంజన్, మిరపకాయ్, మర్యాదరామన్న, పుష్ప 2, సలార్, నిప్పు, నిరీక్షణ, పవర్, రుద్రమదేవి, మత్తు వదలరా, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నారు.

బ్రహ్మాజీ తూర్పుగోదావరి జిల్లా వాసి. ఈయన హైదరాబాదులో జన్మించారు. అయినప్పటికీ విద్యాభ్యాసం అంత పశ్చిమగోదావరి జిల్లాలోనే అయ్యింది. అయితే బ్రహ్మాజీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈయన వివాహం ఆర్య సమాజ్ లో జరిగింది. బ్రహ్మాజీ భార్య సస్వతి. అయితే నేడు వీరి పెళ్లి రోజు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ద్వారా ప్రేక్షకులందరికీ నవ్వించారు. తన భార్య సస్వతిపై తనకున్న ప్రేమను చెప్పుకొచ్చారు. అందులో బ్రహ్మాజీ.. "పెరుగన్నంలో ఆవకాయల.. పాలకు డెవిడోఫ్ కాఫీలా.. వోడ్కాకి జింజిర్ అలేలా.. నా జీవితానికి నవ్వులా.. నన్ను భరిస్తున్నందుకు థాంక్స్. హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సస్వతి అంటూ బ్రహ్మాజీ సెటైరికల్ గా పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ భలే విష్ చేశారు.. బ్రహ్మాజీ కమెడియన్ అని నిరూపించుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: