
టాలీవుడ్ నవ మన్మథుడు ... అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏ మంత ఆశాజనకంగా లేదు. అఖిల్ హీరో అయ్యి పదేళ్లు దాటుతోంది. ఇప్పటకీ కెరీర్ పరంగా చెప్పుకునేందుకు ఒక్క హిట్ కూడా లేదు. ఏదో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అఖిల్ వరుస పెట్టి ప్లాపులు మీద ప్లాపులు ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ హీరోగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా లెనిన్.
లెనిన్ సినిమా తో అయిన తనకు ఓ గట్టి కం బ్యాక్ దక్కుతుందేమో అన్న ఆశ అయితే అఖిల్ తో పాటు ఇటు అక్కినేని అభిమానుల్లో ఉంది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే రిలీజ్ డేట్ విషయం లో మేకర్స్ తాజాగా ఇచ్చిన షాక్ లీక్‌కు ఫ్యాన్స్ లో ఎక్కడా లేని నిరాశ అయితే వచ్చేసింది. లెనిన్ సినిమా ఈ యేడాది చివరిలోనే విడుదల అవుతున్నట్టుగా టాక్. నవంబర్ 14న రిలీజ్ ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ మధ్యలో దసరా లేదా దీపావళికి అయినా అఖిల్‌ను థియేటర్ల లో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఇది పెద్ద షాకింగ్ న్యూసే అని చెప్పాలి. లెనిన్ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు