సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి అంటే భయపడిపోతూ ఉంటారు . వాళ్ళకున్న పబ్లిసిటీ.. ఎక్కడ డౌన్ ఫాల్ అవుతుందో అనే ఒక భయం అందరికీ ఉంటుంది.  అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరోలు మాత్రం ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటారు . బాలీవుడ్ హీరోలు చేసినంత అవలీలగా తెలుగు హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ చేయలేరు. అది అందరికీ తెలిసిందే.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా రొమాంటిక్ యాంగిల్ నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు హీరోలు . కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరోలు మాత్రం కూసింత పద్ధతి అంటూ లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉంటారు .


ఒక తెలుగు హీరో మాత్రం డైరెక్టర్ ని అడిగి మరీ ముద్దు సీన్ రాయించుకొని హీరోయిన్ తో లిప్ లాక్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఆ తెలుగు హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాస్ మహారాజా "రవితేజ". ఆ హీరోయిన్ మరెవరో కాదు తన అందంతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న "మీనాక్షి చౌదరి".  వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమా "ఖిలాడి". ఈ సినిమా పెద్దగా జనాలను ఎంటర్టైన్ చేయకపోయినా కలెక్షన్స్ సాధించకపోయినా.. రవితేజ - మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ పై మాత్రం మంచి ప్రశంసల వర్షం కురిపించింది .



2022లో విడుదలైన ఈ సినిమా అభిమానులకి తెలియని కిక్ ఇచ్చింది. కలెక్షన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . అయితే ఈ సినిమాలో మీనాక్షి - రవితేజల మధ్య లిప్ లాక్ సన్నివేశం వస్తుంది. అది సినిమాని హైలెట్ గా మార్చేసింది. ఆ లిప్ లాక్ సీన్ కోసమే థియేటర్ కి వెళ్లి సినిమా చూశారు సినిమా  జనాలు అని చెప్పడంలో సందేహం లేదు.  అయితే  రవితేజ ఆ సీన్ అడిగి మరి రాయించుకున్నారట . డైరెక్టర్ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఏమీ పెట్టలేదట.  మీనాక్షి అందం చూసి  ఇలా చేశాడు రవితేజ అంటూ అప్పట్లో చాలా దారుణంగా మాట్లాడుకున్నారు జనాలు . ఆయనపై అలాంటి వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత రవితేజ కానీ మీనాక్షి చౌదరి కానీ దానిపై స్పందించలేదు.  అలా అలా ఆ వార్తలు కూడా కనుమరుగైపోయాయి.  మరొకసారి మీనాక్షి చౌదరి పాపులారిటి పెరిగిపోతూ ఉండటంతో ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు ఆకతాయిలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: