ప్రముఖ నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక సురేఖ వాణికి సుప్రీత అనే కుమార్తె ఉంది. సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ సినిమాలలో నటించనప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో వీడియోల రూపంలో షేర్ చేసుకుంటుంది.


తనకు సమయం దొరికినప్పుడల్లా లొకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులు, పార్టీలకు వెళ్లడం లాంటి పనులు అధికంగా చేస్తోంది. ఇక తల్లి, కూతుర్లు ఇద్దరూ వారి అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంటారు. వారికి సంబంధించిన ఫోటోలు ఇద్దరూ సోషల్ మీడియాను షేర్ చేస్తారు. సురేఖ వాణి గత కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ తో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను కూడా గతంలోనే నిర్వహించారు. 

కానీ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలబడలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సుప్రీత ఓ భయంకరమైన వ్యాధితో పోరాడుతోంది. ఈ వ్యాధికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. చేతికి ఈ సెలేన్ పెట్టుకుని బెడ్ మీద పడుకున్నటువంటి ఫోటోలు సుప్రీత తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. తాను చెప్పుకోలేని ఓ భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసి సుప్రీత అభిమానులు తాను తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సుప్రీతను ఇలా బెడ్ పైన చూసి తన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ భామ తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: