
అయితే కొన్ని వారాల క్రితం విడుదలైన ఈమూవీ టీజర్ అందరికీ బాగా నచ్చడంతో రెహమాన్ పై చరణ్ అభిమానులు ఏర్పరుచుకున్న భయాలు సందేహాలు నెమ్మదినెమ్మదిగా తొలిగిపోతున్నాయి. సుమారు నెలన్నర క్రితం విడుదల చేసిన ఈసినిమాకు సంబంధించిన చిన్న వీడియో క్రియేట్ చేసిన సంచలనం మీడియాకు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
ఈమధ్య ఈసినిమాకు సంబంధించి దర్శకుడు బుచ్చి బాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రెహమాన్ గురించి మాట్లాడుతూ రెహమాన్ ఈ సినిమా సంబంధించిన ప్రతి పాటకు 30 ఆప్షన్లుతో కూడిన రకరకాల ట్యూన్స్ ఇచ్చిన విషయాన్ని తెలియచేశాడు. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలకు మించి ఉంటుందని గ్రామీణ మూలాలను స్పృశించే కధ కావడంతో రెహమాన్ ఈసినిమాకు చాల కష్టపడి పని చేస్తున్న విషయాన్ని వివరించాడు.
ఇదే సందర్భంలో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఈసినిమాలో క్రికెట్ కేవలం బ్యాక్ డ్రాప్ లో మాత్రమే ఉంటుందని దానికి మించిన బలమైన ఎమోషన్ స్టోరీ ఈమూవీలో ఉంటుందని ఈమూవీ పై అంచనాలు బుచ్చిబాబు పెంచుతున్నాడు. ఇప్పటిదాకా ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ ఈమధ్యనే ప్రారంభం అయింది. వచ్చే ఏడాది మార్చి 27 విడుదలకాబోతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే..