
ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని పడవ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. డ్రాగన్ సినిమా రిలీజ్ కు సమయం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదని తెలుస్తోంది. వార్2 సినిమాలో హృతిక్, కియారా కాంబోలో ఒక సాంగ్ ఉంటుందని ఈ సాంగ్ లో కియారా అద్వానీ బికినీలో కనిపిస్తారని తెలుస్తోంది.
హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సాంగ్ ఉంటుందని ఈ సాంగ్ షూట్ మాత్రం వచ్చే నెలలో జరగనుందని జూన్ నెలాఖరు నాటికి ఈ సినిమా పూర్తి కానుందని భోగట్టా. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న వార్2 పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అవకాశం వార్2 సినిమాకు అయితే ఉంది. వార్2 వర్సెస్ కూలీ పోటీలో వార్2 పైచేయి సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. వార్2 మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మెమరబుల్ మూవీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.