
ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించాడు . చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ దక్కించుకున్నాయి . అయితే ప్రభాస్ కెరియర్ లో ది మోస్ట్ ఫేవరెట్ సినిమా అందరికీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా "చక్రం" అని చెప్పాలి. బాహుబలి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి సినిమాలో ఎంత టాలెంటెడ్ పర్ఫామెన్స్ చూపించిన ప్రభాస్ అంటే అందరికీ బాగా ఇష్టమైన సినిమా మాత్రం "చక్రం". ఈ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ..ప్రభాస్ యాక్టింగ్ ..ప్రభాస్ డైలాగ్ డెలివరీ..ప్రభాస్ నాటీనెస్..అన్ని బాగుంటాయి.
మరి ముఖ్యంగా ఈ సినిమా చాలా చాలా ఎమోషనల్ గా అభిమానులకి కనెక్ట్ చేసింది ప్రభాస్ ని అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . అయితే సినిమా క్లైమాక్స్ సీన్ లో ప్రభాస్ కి క్యాన్సర్ ఉంది అని చనిపోతాడు అని తెలియకుండా మ్యానేజ్ చేసే క్రమంలో అసిన్ తో చాలా చాలా వల్గర్ గా మాట్లాడుతాడు హీరో ప్రభాస్ . ఆ టైంలోనే "నన్ను లవ్ చేశావ్ గా.. నన్ను ఎలా మోసం చేశావు" అని అడగ్గా.. ప్రభాస్ చాలా కఠినంగా వల్గర్ గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది . "నిన్ను పెళ్లి చేసుకోను ఉంచుకుంటాను" అనే విధంగా "మూడు రోజుల నీతో మూడు రోజులు అక్కడ.. ఎంజాయ్ ఓకేనా" అని కన్ను కొట్టి మరి చెపుతాడు.
ఆ సీన్ కి సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తూ కొంత మంది ప్రభాస్ అంటే పడని వాళ్లు ఆయనపై నెగటివ్గా కామెంట్స్ చేస్తున్నారు . ప్రభాస్ కి నిజ జీవితంలో పెళ్లి కాదు అని లాస్ట్ కి ఇలానే సెటిల్ అయిపోవాల్సి వస్తుందేమో అని ఘాటుఘాటుగా కౌంటర్ వేస్తున్నారు . దానికి తగ్గట్టే రెబెల్ ఫాన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రభాస్ చక్రం సినిమాకి సంబంధించిన ఆ వీడియో వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది . అలా అనుకుంటే ఎంతోమంది స్టార్స్ సినిమాల విషయంలో చీప్ గా వల్గర్ గా డైలాగ్స్ వాడారు . అందరిని అలాగా ట్రోల్ చేయండి రా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్..!