- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో డిజాస్టర్ అయిన కూడా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సినిమా ఖలేజా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు - అనుష్క జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2010 లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మహేష్ బాబు న‌టించిన ఈ డిజాస్ట‌ర్ అంటే కేవ‌లం మ‌హేష్ అభిమానులు మాత్ర‌మే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ వేలం వెర్రి గా చూస్తారు .. ఎందుకో కానీ 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 2007 చివరలో అతిధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ సినిమా ప్లాప్ అవడంతో మూడున్నర సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదు. ఆ తర్వాత ఖలేజా సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.


మహేష్ బాబును ప్రేక్షకులు తమ కోరుకున్న దానికంటే భిన్నంగా తెర మీద చూడటం చాలా మందికి నచ్చలేదు. అలాగే ఈ సినిమాకి పోటీగా ఎన్టీఆర్ బృందావనంతో పాటు . . రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖలేజా అంచనాలు అందుకోకపోవడం దీనికి తోడు బృందావనం , రోబో సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రేక్షకులు ఖ‌లేజా సినిమా ను పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఖ‌లేజా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే బుల్లితెర మీద ఈ సినిమా ఎప్పుడు ప్రసారమైన కూడా ఎంతో ఆసక్తితో చూస్తారు. అందుకే ఎన్ని సార్లు ఖ‌లేజా టీవీ ల‌లో వ‌చ్చినా కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: