
పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటుగా కొంతమంది నిర్మాతలలో (అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్) కుట్ర చేశారన్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు లేనిది ఇప్పటికిప్పుడు థియేటర్లు బంద్ చేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది అంటు నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో వైసీపీ పార్టీ హస్తం ఉందని తెలియజేస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరహాలోనే కుట్ర జరిగింది అంటూ తెలియజేశారు.
మరొకవైపు సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిక్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయం పైన వెనక ఎవరేరున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటూ మంత్రి కందుల దుర్గేష్ కూడా హోం శాఖకు పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పైన నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యారు.. సినీ ఇండస్ట్రీకి కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తే తమకు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ఇకమీదట ఎలాంటి చర్చలు జరిపేది లేదంటే డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. మరి వైసీపీ నేతలు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి.