
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `డ్రాగన్` టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయింది. ఇటీవలె ప్రారంభమైన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉన్న రష్మికను సంప్రదించారట. మొదట ఆమె ఆసక్తి చూపనప్పటికీ.. డైరెక్టర్ రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. స్టోరీలో భాగంగా రష్మిక చేయబోయే ఆ స్పెషల్ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుందట.
అయితే రష్మిక ఇంతవరకు ఐటమ్ సాంగ్స్ చేసింది లేదు. గతంలో అటువంటి ఆఫర్లు వచ్చిన కూడా రిజెక్ట్ చేసింది. అటువంటి రష్మిక ఇప్పుడు డ్రాగన్ లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసేందుకు అంగీకరించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియదు. కానీ, నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు రష్మిక నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు. రష్మిక చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటుందని.. పాన్ ఇండియా హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న సమయంలో ఈ విధంగా ఐటమ్ సాంగ్స్ చేయడం కరెక్ట్ కాదని పలువురు సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు