
అయితే ఇప్పుడు ఈ విధంగా బేబీ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు .. సాయి రాజేష్ దీని కోసమే వేరే తెలుగు సినిమా చేయకుండా టీం తో స్కిప్ట్ వర్క్ చేస్తున్నారు .. కానీ కొన్ని కీలక మార్పులను కూడా రాసుకున్నారట .. ఇక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు కానీ అది కూడా కొలిక్కి రావటం లేదు .. భారీ ఎత్తున ఆడిషన్ చేసినప్పటికీ వైష్ణవి చైతన్య రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేసేవాళ్లు దొరకటం కష్టంగా ఉందట .. పోనీ ఆమెనే తీసుకుందామంటే భాష సమస్యతో పాటు ఇతర ఇతర కారణాలు ఆప్షన్ గా పెట్టుకోనివ్వడం లేదని తెలుస్తుంది .. ఇక బేబీ హిందీ కి ఎస్కెఎన్ తో పాటు అల్లు అరవింద్ , మధు మంతెనలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ..
అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా ఇంకా ఎక్కడో సమస్య ఉంది బేబీ లాంటి కథలు బాలీవుడ్ లో కొత్త ఏమీ కాదు .. ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి చాలా వచ్చాయి .. అయితే దర్శకుడు సాయి రాజేష్ ట్రీట్మెంట్ ఎంతో ఫ్రెష్ గా ఉంది కాబట్టి వర్కట్ అవ్వొచ్చనే నమ్మకంతో ముందడుగు వేశారు .. అయితే ఇప్పుడు తాజా రిపోర్ట్స్ చూస్తుంటే హిందీ బేబీ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు .. ఇదే నిజమైతే సాయి రాజేష్ మరో కొత్త కథతో తెలుగు సినిమా ఏదైనా మొదలుపెట్టడం బెటర్ అని అంటున్నారు .. తమెంటో ప్రూఫ్ చేసుకున్న ఇలాంటి దర్శకుల సైతం రెండు మూడు సంవత్సరాల తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోవటం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని కూడా విశ్లేషకులు అంటున్నారు .. ఇక మరి చూడాలి దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు .