టాలీవుడ్ లో మాస్ సినిమాలు కేరార్ ఆఫ్ అడ్రస్ అంటే నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రమే .. తొడగొట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసే రికార్డులు క్రియేట్ చేయడం ఆయన సొంతం .. అలాంటి బాలయ్య ఈమధ్య కొన్ని వెరైటీ కథలతో ఫ్యాన్స్ ను తెగ మెప్పిస్తున్నారు .. అలాగే టాక్ షోకు హోస్ట్ గా చేస్తూ తనలోని డిఫరెంట్ యాంగిల్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు .. బాలకృష్ణలో ఇలాంటి క్రేజీ ఫన్ యాంగిల్ ను చూసి అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు .. అన్ స్టాప‌బుల్ గా బాలయ్య అయితే  మంచిఫామ్ లో దూసుకుపోతున్నారు . ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 తొండవం సినిమా చేస్తున్నారు ..


సినిమా పూర్తి చేసిన వెంటనే తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నారు .. ఇప్పటికే గోపి తో వీర‌ సింహారెడ్డి సినిమా తీసి భారీ హీట్ కొట్టుడు బాలయ్య .. అయితే ఈసారి మాస్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది .. రీసెంట్ గానే సన్నీ డియోల్ తో జాట్ అనే సినిమా చేసి హీట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని ..  బాలీవుడ్ లో సన్నీని మాస్ ఎలివేషన్ లో చూపించి అక్కడి ప్రేక్షకులను  ఔరా అనిపించాడు గోపీచంద్ .. అందుకే బాలీవుడ్ ఆడియన్స్ కూడా గోపీచంద్ తర్వాత సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు .. బాలయ్యతో గోపీచంద్ చేసే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతుందని ప్రచారం జరుగుతుంది ..


ఇక బాలకృష్ణ కూడా నేషనల్ లెవెల్ లో మాస్‌ సినిమా తీస్తే ఆ హంగామా మరో రేంజ్ లో ఉంటుంది .. ఇప్పటికే జాట్ తో బాలీవుడ్ ప్రేక్షకులకి గోపీచంద్ పరిచయమ‌య‌య్యాడు  కాబట్టి అతని డైరెక్షన్లో వస్తున్న సినిమాగా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉంటాయి ..  ఇక అఖండ 2 ను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .. దీన్నిబట్టి బాలయ్య కూడా మిగతా స్టార్స్ లా తన పాన్ ఇండియా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది .. గోపీచంద్ సినిమా మాత్రం క్లిక్ అయితే బాలీవుడ్ లో కూడా బాలయ్య మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది .. ఇక మరి గోపీచంద్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఆ సినిమా ఎప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది అనేది  వేచి చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: