
అయితే నిర్మాత ఏఎం రత్నం మాత్రం అనుకున్న రేట్లు రాకపోవడం వల్ల కొన్ని ఏరియాల బిజినెస్ ఆలస్యమవుతోందని ట్రైలర్ విడుదలైతే బిజినెస్ ఆటోమేటిక్ గా జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 130 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. హరిహ వీరమల్లు సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
అయితే కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించే అవకాశం అయితే లేదు. హరిహర వీరమల్లు పార్ట్2 తెరకెక్కుతుందని నిర్మాత చెబుతున్నా వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యే ప్రాజెక్ట్ అయితే కాదు. హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఏ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు