సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి.  ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని సినీ లవర్స్ భయపడిపోతున్నారు.  ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ చాలా మంది అతి చిన్న వయసులోనే మరణిస్తున్నారు . కొంతమంది సూసైడ్ చేసుకొని మరణిస్తూ ఉంటే ..మరి కొంతమంది అనారోగ్య కారణంగా మరణిస్తున్నారు . మరికొంత మంది యాక్సిడెంట్ ల కారణంగా మరణైస్తున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టిపీడిస్తున్నాయి . తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు.


బాలు మహేందర్ , వెట్రిమారన్  వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్ సుకుమారన్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లుగా సమాచారం అందుతుంది. గుండెపోటుతో ఆయన మరణించిన్నట్లు తెలుస్తుంది . శతునుతో మద యానై కోటం , రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి అందరిని మెప్పించిన సుకుమారన్ ఇక లేరు . ఇందస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే ఆయన తన సినిమాలతో కోట్లాది మంది మనసులను కొల్లగొట్టాడు. ఇక ఇప్పుడు సూరితో ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. అది ఆయన డ్రీమ్  ప్రాజెక్ట్ అంటూ కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చేవారు . అయితే ఆ కల నెరవేరకుండా నే కన్నుమూశారు . ఇంత చిన్న వయసులోనైనా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేస్తున్నారు.



ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికిగురైంది. మధురైలో బస్సు ఎక్కుతూ ఉండగా ఒక్కసారి హార్ట్ ఎటాక్ రావడంతో కారణంగా ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం అందుతుంది.  ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . అంతేకాదు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కోలీవుడ్ సినీ స్టార్స్. డైరెక్టర్ విక్రమ్ సుకుమారణ్  మరణం పట్ల నటుడు శంతాను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. " మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను" అంటూ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: