
అయితే తాజాగా ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకప్పటి తారక్ తిండి పిచ్చి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ చెప్పింది వింటే పడి పడి నవ్వుకోవాల్సిందే. `భైరవం` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ.. తారక్ హీరోగా నటించిన `ఆది` మూవీ రోజులను గుర్తు చేశారు. ఆది చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు సినిమా టీమ్‌తో పాటు నిర్మాత తనయుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వెళ్లేవాడట. ఎన్టీఆర్ తో మంచి పరిచయం ఉండటంతో ఒకరోజు ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు.
దారిలో మెక్ డొనాల్డ్స్ కనపడటంతో బర్గర్ తిందామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. అయితే లోపలకు వెళ్లాక ఎన్టీఆర్ బర్గ్‌లు తినడం స్టార్ట్ చేశాడట. అసలు ఎన్ని తిన్నాడో కూడా లెక్క లేదు.. వరుస పెట్టి తింటూనే ఉన్నాడని.. ఫుడ్ అంటే తారక్ కు అంత ఇష్టమని బెల్లంకొండ చెప్పుకొచ్చాడు. అలాగే ఫ్లైట్ లో జర్నీ చేసేటప్పుడు తమ చేతుల్లో ఉండే బటర్ క్రాస్టెంట్‌లను సైతం లాగేసుకొని మరీ తినేసేవాడని.. తాము చిన్నపిల్లలం కావడంలో ఏమీ అనకుండా ఉండేవాళ్లమని బొల్లంకొండ చెప్పుకొచ్చాడు. అటువంటి తారక్ ఇప్పుడు ఇంత ఫిట్ మారడం నిజంగా తనకు షాకింగ్‌గా ఉందని.. ఆయన డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చని బెల్లంకొండ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.