
అలాగే సినిమాలో బాగా నెగిటివిటీ తెచ్చుకున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా త్రిష పోషించిన ఇంద్రాణి క్యారెక్టరే. బార్ డాన్సర్‌గా ఆమె ఆడియెన్స్ కు పరిచయం అవుతుంది. వేశ్యా గృహం నుంచి విముక్తి కలిగించిన శక్తిరాజ్(కమల్ హాసన్)ను ఇంద్రాణి ఆరాధిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. మరోవైపు శక్తిరాజ్ పెంపుడు కొడుకు అమర్(శింబు) సైతం త్రిషకు ఎట్రాక్ట్ అవుతాడు.
సింపుల్ గా చెప్పాలంటే తండ్రి, కొడుకులైన కమల్-శింబులతో సంబంధం పెట్టుకున్నట్లు త్రిష క్యారెక్టర్ కనిపిస్తుంది. అసలు కథతో ఏమాత్రం సంబంధం లేని కరివేపాకు లాంటి పాత్ర ఆమెది. ఒక పాట, మూడు నాలుగు సన్నివేశాల్లో మాత్రమే త్రిష కనిపిస్తుంది. కమల్-త్రిష మధ్య వచ్చే రొమాంటికి సన్నివేశాలు కూడా చాలా వెగటు కలిగిస్తాయి. ట్విస్ట్ ఏంటంటే.. సినిమా చివర్లో ఆమె పాత్రను చంపేస్తారు. కేవలం ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించడం కోసమే అన్నట్లు త్రిష క్యారెక్టర్ ఉంటుంది.
డైరెక్టర్ మణిరత్నం ఎందుకు ఇంద్రాణి పాత్రను రాసుకున్నారో.. అసలు భారీ స్టార్డమ్ ఉన్న త్రిష అటువంటి పాత్రలో ఎందుకు నటించిందో అర్థంగాక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. నెటిజన్లు ఒక అడుగు ముందుకేసి.. త్రిషను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. థగ్ లైఫ్ చిత్రానికి త్రిష రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో డబ్బు కోసమే థగ్ లైఫ్‌లో పని చేశావా అంటూ త్రిషపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మొత్తానికి ఈ మూవీ త్రిష్ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసి పడేసింది.