
అల్లు అర్జున్ కోసం అనుకున్న స్టోరీలో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ కోసం అనుకున్న స్టోరీలో చరణ్ ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా ట్రయాంగిల్ సినిమా స్టోరీ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో బన్నీ కోసం త్రివిక్రమ్ రాసుకున్న కథను ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్నాడు అని .. గాడ్ ఆఫ్ వార్ గా భారీ ఎత్తున మైథాలజికల్ ప్రాజెక్ట్ రాబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం నాగ వంశీ చేసిన ఒకే ఒక్క ట్విట్ .
అయితే ఇప్పుడు ఇక్కడే ఓ న్యూస్ సంచలనంగా మారింది , గతంలో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథను బుచ్చిబాబు సనా ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్నార్డు. నిజానికి బుచ్చిబాబు సన్న పెద్ది సినిమాను ఎన్టీఆర్ తో తెరకెక్కించాలి అంటూ చాలా టైం వెయిట్ చేశారు . కానీ అది కుదరలేదు . ఫైనల్లీ ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ చరణ్ కు సూట్ అయ్యింది. ఇప్పుడు బన్నీ కోసం అనుకున్న త్రివిక్రమ్ స్టోరీ ఎన్టీఆర్ వద్దకు వచ్చింది .
అదేవిధంగా అట్లీ నిజానికి అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాను మొదటిగా రామ్ చరణ్ కోసం అనుకున్నారట. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత అట్లీ - చరణ్ కాంబోలో సినిమా రాబోతుంది అని టాక్ వినిపించింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు . అదే ప్రాజెక్టులో ఇప్పుడు అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అంటూ టాక్ వైరల్ అవుతుంది. ఇలా ముగ్గురు హీరోలు ఒకరి కోసం అనుకున్న కథలో మరొకరు తెలియకుండానే భలే ఫిక్స్ అయిపోయారు అంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్శ్ వాళ్లకి ఎలాంటి పాజిటివ్ టాక్ తెచ్చిపెడుతుందో...???