
టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్పరాజ్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా లో భారీ అగ్ర తారాగణం నటిస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ లైన్ అప్ లో మరిన్ని క్రేజీ సినిమాలు ఉండగా వాటిలో త్రివిక్రమ్ తో అనుకున్న సినిమా క్యాన్సిల్ అయినట్టే అని ఊహాగానాలు వస్తున్నాయి .. ఇది పక్కన పెడితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో ఓ భారీ సినిమా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కాకుండా మరో సినిమా పై లేటెస్ట్ బాజ్ వినిపిస్తుంది .. దాని ప్రకారం సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ..
ఇది గతం లోనే నిర్మాత దిల్ రాజు , ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది .. అయితే అదే సినిమా కి హీరో గా అల్లు అర్జున్ లాక్ చేసినట్టుగా ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి .. ఇక మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి .. అయితే అల్లు అర్జున్ , ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాకు మరింత సమయం పడుతుందని అంటున్నారు .. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు .. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ 2 , కే జి ఎఫ్ 3 వంటి సినిమాలు కూడా ప్రశాంత్ లైన్లో ఉన్నాయి .. ఇక దీంతో అల్లు అర్జున్ , ప్రశాంత్ నీల్ సినుమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు