
అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ త్రివిక్రమ్ లైనప్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్ఛేసారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్క్రిప్ట్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారా? లేక మరో స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నారా అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.
చరణ్ త్రివిక్రమ్ కాంబో మూవీ ప్రస్తుతానికి అయితే లేనట్టేనని తెలుస్తోంది. మరోవైపు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో నటిస్తుండగా ఈ రెండు సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ అందించనున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లైనప్ మాత్రం అదిరిపోయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎన్నో ఆసక్తికర ట్విస్టులతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మరో ఐదేళ్ల వరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా బిజీగా ఉండనున్నారు. వార్2 సినిమా విడుదలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి వేరియేషన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. వరుసగా 7 విజయాలు అందుకున్న తారక్ భవిష్యత్తు సినిమాలతో సైతం మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.