చాలామంది హీరోలు సైతం ఎక్కువగా విగ్గు వంటివి పెట్టుకోవడం పాత్రలకు తగినట్టుగా మారుతూ ఉండడం అభిమానుల చేత ప్రశంసలు పొందడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో విగ్గు వల్ల ట్రోల్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు సెలబ్రిటీలు నిజజీవితంలోనే కాకుండా బయట కూడా విగ్గుతో కనిపిస్తూ ఉంటారు. అభిమానులను ఆనందపరచడానికి ఫేక్ విగ్గులు, మీసాలు వంటివి ధరిస్తూ ఉంటారు. అవి లేకుండా బయటికి వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుడు మీసాలు లేకుండా బయట తిరగలేకపోతున్నారు.


తాజాగా మరొకసారి బాలకృష్ణ ది పెట్టుడు మీసం అన్నట్లుగా బయటపడింది. ఒక స్టేజి పైన బాలకృష్ణ మాట్లాడుతూ ఉండగా మూతికి అతికించుకున్నటువంటి ఫేక్ మీసం ఊడిపోతూ ఉన్న సమయంలో గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని ప్రసంగాన్ని కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో అభిమానుల సమక్షంలోనే కేకు కట్ చేస్తే గ్రాండ్గా తన పుట్టినరోజునే జరుపుకోవడం జరిగింది.


బాలయ్య కత్తిని గాలులో తిప్పుతూ కేక్ కట్ చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది. అలాగే అభిమానులను ఉద్దేశించి మరి స్పీచ్ చేసిన బాలయ్య ఎప్పటిలాగే తన బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ డైలాగులతో అదరగొట్టేశారు. బాలయ్య అలా మాట్లాడుతున్న సమయంలో పెట్టుడు మీసం కాస్త ఊడిపోతున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.. దీంతో వెంటనే బాలయ్య గమ్ ఇవ్వండి అంటూ ఫైర్ అయ్యారు. అలా గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మరి మీసాలను అతికించుకొని మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్స్ ఏంటి బాలయ్య ఈ వయసులో ఇలాంటి పెట్టు మీసాలు అవసరమా అంటూ.. ట్రోల్ చేస్తున్నారు. సినిమాలలో అంటే తప్పదు నిజజీవితంలోనైనా సహజంగానే ఉండవచ్చు కదా అంటూ పలువురు మెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: