ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ ఏ హీరోతో సినిమాను తెరకెక్కిస్తాడు అనేది పెద్ద గగనంలా మారిపోయింది . ఈ డైరెక్టర్ ఈ హీరోతో సినిమా అనౌన్స్ చేశాడులే..వీళ్ళ కాంబోలో ఒక సినిమా వస్తుందిలే అని ఆనందపడే లోపే ఆ కాంబో రిజెక్ట్ అయిపోతుంది . ఆ హీరో స్ధానంలో మరోక హీరో వస్తున్నాడు. లేదా డైరెక్టర్ స్థానంలో మరొక డైరెక్టర్ వస్తూ ఉన్నాడు.  మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరు మాట్లాడుకునేది త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో గురించి. పుష్ప2 సినిమా తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా రావాలి . అంతా సెట్ అయిపోయింది. అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ అయిపోయింది.  కానీ సడన్గా అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో సినిమా అంటూ అటు పక్కకి వెళ్లిపోయాడు .


పోనీలే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే అని అందరు సైలెంట్ అయిపోయారు. మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా వస్తుందిలే అని ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలుకే బయటపడిన మేటర్ ఏంటంటే వీళ్ళ కాంబోలో సినిమా టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది . త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కోసం రాసుకున్న కథతో ఇప్పుడు ఎన్టీఆర్ ను చూపించబోతున్నాడు అంటూ తాజాగా బయటపడింది . నిజానికి అలా వైకుంఠపురం లో తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాకి ఫిక్స్ అయి ఉన్నారట .



కానీ కొన్ని కారణాల చేత ఇది హోల్డ్ లో పడింది . మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది అంటూ టాక్ వినిపిస్తుంది.  అయితే ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఈ రేస్ లో ఉన్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయ్.  కుదిరితే ఎన్టీఆర్ లేదంటే రామ్ చరణ్ కచ్చితంగా ఈ ఇద్దరితో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఉంటుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఇలాంటి మూమెంట్లోనే ఊహించని హీరో పేరు తెరపైకి వచ్చింది.  త్రివిక్రమ్ ఇప్పటివరకు  ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు .



వీళ్ళ కాంబోలో సినిమా రావాలి అంటూ ఎప్పటినుంచో ఫాన్స్ వెయిటింగ్ . త్రివిక్రమ్ - చరణ్ కాంబోలో కూడా సినిమా రాలేదు.  కానీ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసే కాంబో మాత్రం ప్రభాస్ - త్రివిక్రమ్ . త్రివిక్రమ్ - చరణ్ - ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ తో సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . ఆల్రెడీ అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయినట్లే అయ్యి వెనక్కి వచ్చేసాడు త్రివిక్రమ్ . అంతే కాదు ఎన్టీఆర్ తో సినిమా అంటూ పరోక్షకంగా బిగ్ బాంబ్ కూడా పేల్చేసాడు.  ఒకవేళ ఇది కూడా క్యాన్సిల్ అయ్యి ఆ ప్లేస్ లోకి ప్రభాస్ వస్తే మాత్రం ఇక సినిమా ఇండస్ట్రీలో ఇదే బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో..?  ఆయన అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులో కీలక పాత్రలో మెరిసే ఛాన్స్ ఎవరికీ ఇస్తాడు అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: