తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున గద్దర్ ఫిలింఫేర్ అవార్డులు చాలా గ్రాండ్గా జరిగాయి. ఈ అవార్డు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదితర మంత్రులు సెలబ్రిటీలతోపాటు మరికొంతమంది హాజరయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రాజమౌళి ,బాలకృష్ణ, దిల్ రాజు, విజయ్ దేవరకొండ సీనియర్ హీరోయిన్స్ కూడా హాజరయ్యారు. పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా గద్దర్ అవార్డులను ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డును సీఎం చేతుల మీదుగా పురస్కరించుకున్న తర్వాత అల్లు అర్జున్ సినిమా డైలాగుతో అదరగొట్టారు


ఈ అవార్డు అందుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అన్న ,డిప్యూటీ సీఎం భట్టి గారికి  థాంక్స్ అండ్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కు చిత్ర బృందానికి రాజమౌళికి ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని మరి అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా వీలలు వేస్తూ చప్పట్లు కొట్టారు.."ఆ బిడ్డ మీద ఒక్క గీతపడ్డ గంగమ్మ తల్లి జాతర లో యాట తలలు నరికినట్టుగా ఒక్కొక్కరిని నరుకుతా.. పుష్ప పుష్ప రాజ్  అసలు తగ్గేదేలే అంటు అని చెప్పిన డైలాగు అందరి చేత చప్పట్లు కొట్టించేలా చేసింది.


ఎందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అయితే 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అవార్డులను ప్రోత్సహించడంతో చాలా ఆనందంగా ఉందంటూ సెలబ్రెటీలు కూడా తెలియజేస్తున్నారు. నంది అవార్డులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందంటూ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు సంబంధించి ఏం చేయాలో ఏం కావాలో చెప్పండి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామంటూ. అలాగే గద్దర్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: