పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో చాలా కాలం క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొంత కాలం పాటు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగింది. దానితో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొంత కాలానికి ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక పవన్ రాజకీయ పనులతో చాలా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ను పవన్ పక్కన పెట్టాడు. దానితో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఆ గ్యాప్లో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా చాలా కాలం క్రితమే విడుదల కూడా అయింది. ఇకపోతే పవన్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కూడా పెద్ద ఎత్తున డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ మూవీ బృందం వారు పవన్ ఇచ్చిన డేట్స్ లోపు కచ్చితంగా ఈ మూవీ ని కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం వారు జెట్ స్పీడ్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్టార్ట్ అయిన కొత్తలో ఈ సినిమా తమిళ సినిమా అయినటువంటి తేరి మూవీ కి రీమేక్ గా రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమా తేరి మూవీ కి రీమేక్ గా కాకుండా కొత్త కథతో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా తేరి మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతుందా ..? లేదా కొత్త కథతో తెరకెక్కుతుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: