కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ రవీంద్రన్ , నవీన్ చంద్ర హీరోలుగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా హను రాఘవపూడి దర్శకత్వంలో అందాల రాక్షసి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 2012 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా 2012 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మొదటి రోజు ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు దక్కాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.12 ప్లస్ కోట్ల కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే 2012 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి ఇంపాక్ట్ ను చూపిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని రాహుల్ రవీంద్రన్ , నవీన్ చంద్ర , లావణ్య త్రిపాఠి నటనలకు ఆ సమయంలో మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే దర్శకుడిగా హను రాఘవపూడి కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: