
ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో శేఖర్ కమ్ముల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల ఆ మ్యాజిక్ రిపీట్ చేయనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు ప్రపంచాల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా కొన్ని డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. ధనుష్ బిచ్చగాడి పాత్రకు జీవం పోశారానేలా ట్రైలర్ ఉంది.
సినిమాలో ఎమోషన్స్ కు సైతం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. రష్మిక కేరీర్ లో ఇప్పటివరకు పోషించని తరహా పాత్రను ఈ సినిమాలో పోషించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని బిచ్చగాడి పాత్ర కోసం ధనుష్ చాలా కష్టపడ్డారని ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్స్ మెటీరియల్ ను చూస్తే అర్థమవుతోంది. నాగార్జున సైతం ఈ సినిమాలో భిన్నమైన పాత్రను పోషించారు. దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 47 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం. పెద్దగా పోటీ లేకుండానే థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాకు టాక్ కీలకం కానుంది. రఘువరన్ బీటెక్, సార్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ధనుష్ కుబేర సినిమాతో అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.