
అసలు ఎప్పుడో వాళ్లు జాతీయ అవార్డుల విషయంలో మనకంటే ముందున్నారు. అయినా అలాంటి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమా రాలేదు. అసలు వెయ్యి కోట్లు అనే మాట కలగానే మిగిలింది. పొన్నియన్ సెల్వన్ తో బాహుబలి రికార్డులు బద్ధలవుతాయి అని ఊదరగొట్టుకున్నా ఆ సినిమా తమిళ జనాలకు మినహా మిగిలిన వారికి కనెక్ట్ కాలేదు. అసలు ఆ ఫీట్ సాధించే తమిళ హీరో ఎవరు ? అన్న ప్రశ్న ఇప్పుడు తమిళ సినీ లవర్స్‌ను కుదిపేస్తోంది. సూర్య కంగువా అన్నారు. తుస్సు మంది. ఇక ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ వేళ వెయ్యి కోట్ల ప్రచారం నడుస్తోంది.
అయితే కూలీని రజనీకాంత్ ఖాతాలో వేయట్లేదు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర వంటి ఇతర భాషా హీరోలు కూడా ఉన్నారు.. ఒక వేళ కూలీ రు. 1000 కోట్లు కలెక్ట్ చేయకపోతే జైలర్ 2 ఆ రికార్డ్ సాధిస్తుందని అసలు నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తున్నారు.. తమిళ మీడియా కూడా ఊహాల్లోనే విహరిస్తోంది. తెలుగు వాళ్లు వెయ్యి కోట్లు ఎప్పుడో దాటేసి రు. 2 వేల కోట్ల మార్క్‌ను బాహుబలి 2, పుష్ప 2తో దగ్గరకు వెళ్లి కొట్టినంత పని చేస్తే తమిళ సినిమా ఇప్పటకీ రు. వెయ్యి కోట్ల కలల్లోనే మునిగి తేలుతోంది.