
అయితే దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా రానుంది .. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ , సునీల్ , రఘుబాబు , సుబ్బరాజు .. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి వంటి వారి కీలక పాత్రలు నటిస్తున్నారు .. అలాగే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు . కాగా ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు .. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు . అలాగే మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలకు డైరెక్షన్ అందించిన విషయం తెలిసిందే ..
ఇక మరి పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ విషయం పై ఎప్పటి క్లారిటీ వస్తుంది .. లేక ఈ సినిమాను అసలు రిలీజ్ చేస్తారా .. ? చేయరా ? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు .. ఇప్పటికే నాలుగు సార్లకు పైగా ఈ సినిమా వాయిదా పడుతు వచ్చింది .. ఇక మరి అసలు ఈ సినిమా యూనిట్ ఏం చేయాలనుకుంటుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు .. ఇక మరి పవన్ కూడా హరిహర వీరమల్లు పై స్పష్టమైన నిర్ణయానికి రావాలని కూడా కోరుతున్నారు .