సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయా లు దక్కి న వారికే అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశా లు దక్కుతా యి అని అనేక మంది అభిప్రా యపడు తూ ఉంటా రు . కానీ వారి అభిప్రాయాలు రాంగ్ అని ప్రూవ్ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో భారీ అపజయాన్ని ఎదుర్కొని ప్రస్తుతం మాత్రం ఓ బ్యూటీ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్స్.

ఈమె రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. కానీ ఇందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈమెకు మాత్రం వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. 

ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు మూవీలతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత అనే మూవీలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. మొదటి సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకున్న ఈ బ్యూటీ కి మాత్రం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూడు సినిమాలలో అవకాశాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: