- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో మంచు విష్ణు నటించిన కన్నప్ప కూడా ఒకటి .. అయితే ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది .. ఇక ఈ సినిమా ను డైరెక్టర్ మహేష్ కుమార్ సింగ్ తెరకెక్కించగా .. పూర్తి మైథిలాజికల్ మూవీ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై అంచనాలు మరింత పెంచేసింది . అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో .. ఈ సినిమా కు ఇప్పుడు సెన్సార్ కష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది .. ప్రధానం గా ఈ సినిమా లో బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన క్యారెక్టర్ల పై బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర అభ్యంతరాలు చెప్పుకొస్తుంది ..


 ఇక దాంతో సెన్సార్ బోర్డు కూడా ఈ విషయం పై సినిమాను చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని చెబుతామని కూడా చెప్పింది .. ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా లోని కీలకమైన 13 సన్నివేశాల పై అభ్యంతరం తెలిపారు . ప్రధానంగా ఆ సీన్స్ ను సినిమా నుంచి తొలగించాలని కన్నప్ప టీం కు చెప్పినట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ విషయం పై సినిమా యూనిట్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది .. ఇక జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రాబోతున్న కన్నప్ప సినిమా ను మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: