- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ ఇళ‌య‌ దళపతి విజయ్‌తో లియో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి వార్త అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తోంది. కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున - కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ క్యామియో పాత్రలో నటిస్తున్నాడు.


ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ప్రేక్షకులను స్టార్ట్ చేయటం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కనిపించేది దాదాపు 8 నిమిషాలు అని తెలుస్తోంది. అమీర్ క‌నిపించేది ఇంత తక్కువ సమయం అయినా కూడా అమీర్ చేయబోయే ఇంపాక్ట్ లు అలా నిలిచిపోతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టిస్టార్ వార్ 2 సినిమాకు పోటీగా ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: