
ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి అతిధిగా హాజరయ్యారు. ఈ సమయంలోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల పైన ప్రశంసలు కురిపించారు.. తాను నమ్మే సిద్ధాంతాలకు చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి తెలిపారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి సినిమాలను చేస్తూ ఉన్నారని ప్రశంసలు కురిపించారు. శేఖర్ కమ్మల చాలా సాఫ్ట్ గా ఉంటారని తన సిద్ధాంతాలకు ఏదో అడ్డొచ్చినా సరే కాంప్రమైజ్ కారు అని తెలిపారు.
అందుకే శేఖర్ కమ్ముల అంటే తనకు చాలా గౌరవమని తెలియజేశారు.. ఇలాంటి సమయంలోనే మీరు వాట్సాప్ ఉపయోగిస్తారా అని శేఖర్ కమ్ముల ను రాజమౌళి అడగగా ఉపయోగించనని తెలియజేశారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఉన్న కాలంలో సోషల్ మీడియా యుగం ఎక్కువ గా నడుస్తోంది అయినప్పటికీ కూడా శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ వాట్సప్ ఉపయోగించనని చెప్పడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమా తో బారి విజయాన్ని అందుకున్నారు ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్, లవ్ స్టోరీ వంటి తదితర చిత్రాలను తెరకెక్కించారు.