
రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్ పైన తన మీద కత్తులతో బ్యాట్లతో శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లుగా ఆమె వెల్లడించింది .ఈ క్రమంలోనే తమకు గాయాలయ్యాయని రమ్యశ్రీ, సోదరుడు ప్రశాంత్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పట్ట పగలే ఇలాంటి అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారంటూ ఆమె ఆవేదనను తెలియజేస్తూ కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీధర్ రావు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్టు వేసేలా చర్యలు తీసుకోవాలంటు పోలీసులను కోరింది రమ్యశ్రీ.
రమ్యశ్రీ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది ఇమే ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలలోనే నటించింది. 2019లో బాబాల బాగోతం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత సరదాగా కాసేపు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, రాఘవ, నువ్వు నేను, రాజకుమారుడు, ఆది తదితర చిత్రాలలో నటించింది. అలాగే కన్నడ, హిందీ, భోజ్ పురి వంటి భాషలలో కూడా నటించింది రమ్యశ్రీ. వాస్తవానికి ఇమే అసలు పేరు సుజాత.కానీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి తన పైన జరిగిన ఈ దాడి పై ఎలా స్పందిస్తుందో చూడాలి రా మేస్త్రి