
కింగ్ నాగార్జున మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనే ఎప్పటికీ టాలీవుడ్ మన్మధుడే . అందులో డౌటే లేదు. తన ఇద్దరు కుమారులు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా వచ్చినా కూడా ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాలకి మంచి మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు నాగార్జున నెగటివ్ రోల్స్ చేయలేదు. అలాంటి నాగర్జున సడన్గా విలన్ రోల్స్ చేస్తున్నాడు . హీరోగా మంచి మంచి సినిమాలు వస్తున్నా కూడా నాగ్ విలన్ పాత్రలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఎందుకో అర్థం కావడం లేదు అంటున్నారు అక్కినేని అభిమానులు . లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ "కూలీ". ఈ మూవీపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . అయితే ఈ కూలి సినిమాలో సైమన్ అనే విలన్ పాత్ర చేస్తున్నాడట నాగార్జున . ఇప్పటికే శేఖర్ గమ్మున డైరెక్షన్లో వస్తున్న కుబేర సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు . ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ..? ఆయనకు ఏం తక్కువ ..? వేలకోట్ల ఆస్తి .. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్ లు హీరోలుగా అవకాశాలు ఇస్తున్నారు. కోట్లాదిమంది అభిమానుల అభిమానం ..ఇంకా ఏం కావాలి..? టాలీవుడ్ ని శాసించే కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. మరి ఎందుకు నాగ్ ఇలా విలన్ పాత్రలు చూస్ చేసుకుంటున్నారు అంటూ కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. హీరోగా అవకాశాలు రావట్లేదా ..? లేకపోతే వచ్చిన అవకాశాలను వినియోగపరచుకోవట్లేదా..? అని మరి కొంతమంది మాట్లాడుతున్నారు . ఇంకొంతమంది నాగార్జున తన కెరియర్ ని నాశనం చేసుకుంటున్నాడు అని రాంగ్ రూట్ లోకి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏమో రీజన్ ఏంటో నాగార్జునకే తెలియాలి...!??