స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ సినిమా ఏదనే ప్రశ్నకు ఎక్కువమంది ఏ మాయ చేశావే సినిమా పేరును సమాధానంగా చెబుతారు. త్వరలో ఈ సినిమా రీ రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతన్య సమంత పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు తన దృష్టికి కూడా రావడంతో సమంత ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఐతే చేశారు. జులై నెల 18వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

ఆ తేదికి ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో   ఈ సినిమాను  రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ కెరీర్ లో సైతం ఈ సినిమా బెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. తాను ఏ మాయ చేశావె   రీ రిలీజ్ వెర్షన్ ను  ప్రమోట్ చేయడం లేదని సమంత చెప్పుకొచ్చారు.  ఈ టాక్ ఎక్కడినుంచి వచ్చిందో నాకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.  సినిమాలోని జంటను కలిసి చూడాలని ఫ్యాన్స్  ఇష్టపడొచ్చని ఆమె  పేర్కొన్నారు.

అయితే ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అని ఆమె వెల్లడించారు. నా తోలి సినిమామాయ చేసావె  కాదని ఆమె తెలిపారు.  తమిళ మూవీ  మాస్కోవిన్ కావేరీ నా తొలి  సినిమా అని ఆమె   పేర్కొన్నారు.  ఏ మాయ చేశావే నా రెండో సినిమా అని  ఈ సినిమాలోని ప్రతి షాట్ గుర్తుందని  సమంత చెప్పుకొచ్చారు. సినిమాలో ఇంటి గేట్  దగ్గర తీసిన షాట్  తోలి షాట్ అని  ఆ సీన్ ను  మరిచిపోలేనని  చెప్పుకొచ్చారు.

సమంత రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే   సంగతి తెలిసిందే.  ఈ ఏడాది సమంత  శుభం సినిమాతో  నిర్మాతగా కూడా  విజయాన్ని అందుకున్నారు.  సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్  ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.  సమంత నెక్స్ట్ లెవెల్ విజయాలను అందుకోవాలని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: