మెగాస్టార్ చిరంజీవి 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత చిరంజీవి అదే సంవత్సరం భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు అధికంగా ఉండడంతో ఈ మూవీ విడుదల తేదీ పై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ టీవీ తెలుగు వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన కొన్ని వారాలకు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి , ఆ తర్వాత కొన్ని వారాలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: