
అలా అవకాశాలు కోల్పోయిన హీరోయిన్ ఎవరో కాదు రాజశేఖర్ జీవిత చిన్న కుమార్తె శివాత్మిక. సినీ ఇండస్ట్రీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి అడుగుపెట్టిన 2019లో దొరసాని అనే చిత్రంతో హీరోయిన్ గా మారింది. తన నటనతో మంచి మార్కుల సంపాదించుకున్న తర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. తమిళంలో కూడా రెండు చిత్రాలలో నటించింది. అక్కడ కూడా పరవాలేదు అనిపించుకున్న ఈ అమ్మడు.. గ్యాప్ తీసుకొని మరి పంచతంత్రం, రంగమార్తాండ వంటి చిత్రాలలో నటించింది. కానీ నటిగా మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది శివాత్మిక.
2023 తర్వాత మళ్లీ ఎలాంటి ప్రాజెక్టును కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. దీంతో ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్న వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చారని తెలిపింది. ఏ మేనేజర్ లేదా ఏజెంట్ను కలిసిన కూడా కచ్చితంగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోమని సలహా ఇస్తున్నారంటూ వెల్లడించింది శివాత్మిక. తాను కూడా ఒక నటిని అని గుర్తించి అవకాశాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి కలిగించిందని తెలిపింది. ప్రస్తుతం శివాత్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.