మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.. ఆమె చేసే సినిమాలతో పాటు ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.అయితే అలాంటి నిహారిక తాజాగా ఓ యంగ్ హీరోతో తనకి ఉన్న రిలేషన్ బయటపెట్టి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.మరి ఇంతకీ నిహారిక ఐదేళ్లుగా ఏ హీరోతో రిలేషన్ లో ఉంది..అది నిజమేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మెగా డాటర్ నిహారిక రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు మూవీకి ప్రొడ్యూసర్ గా చేసినందుకుగాను గద్దర్ అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ జోష్ లోనే మరిన్ని సినిమాలను అనౌన్స్ చేస్తున్న నిహారిక ప్రస్తుతం మంచు మనోజ్ తో కలిసి వాట్ ది ఫిష్ మూవీ చేస్తోంది. అలాగే రీసెంట్ గా ఓ కొత్త సినిమాని కూడా అనౌన్స్ చేసింది. 

ఇదిలా ఉంటే తాజాగా నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక ఈ పోస్టులో యంగ్ హీరో అంకిత్ కొయ్యకి సంబంధించిన ఫోటో షేర్ చేసి ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ.. ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ అబ్బాయి నాకు బెస్ట్ సపోర్టర్..పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ ని సపోర్ట్ చేసే మెయిన్ పిల్లర్.. మేమిద్దరం కలిస్తే చాలు గంటలు గంటలు సినిమాల గురించే మాట్లాడేసుకుంటాం. అలాంటి ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.నీ స్వచ్ఛమైన మనసుతో ఇలాగే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

ఇక నిహారిక షేర్ చేసిన పోస్టులో ఉన్నది ఎవరో కాదు రావు రమేష్ ఇంద్రజ ముఖ్యపాత్రలు చేసిన మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో రావు రమేష్ కొడుకు పాత్రలో నటించిన అంకిత్ కొయ్య.ఈయన ఆయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో హీరోగా పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.. అలా తాజాగా అంకిత్ కొయ్య బర్త్డే కావడంతో నిహారిక ఆయనతో ఉన్న బంధాన్ని బయటపెట్టింది.అయితే నిహారిక అంకిత్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని బయటపెట్టినప్పటికీ కొంతమంది ఆకతాయిలు మాత్రం వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే నిహారిక ఈ మధ్యకాలంలో ఏది పెట్టినా దాన్ని నెగటివ్ గానే తీసుకొని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: