సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఎలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . "నక్కతోక తొక్కి వచ్చిందా ఏంటి రా".. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్స్ కొట్టేస్తుంది అంటూ కూడా ఆమె గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.  సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నాకి సంబంధించిన మరొక మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది.  రష్మిక మందన్నా  టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ . నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా "కుబేర" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.


అంతకు ముందు నటించిన  "సికిందర్"  సినిమా ఫ్లాప్ అయినా అంతకుముందు నటించిన "చావా" అంతకంటే ముందు నటించిన "పుష్ప" అంతకంటే ముందు నటించిన "అనిమల్".  ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అన్ని సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి . ఈ క్రమంలోనే  అసలు హీరోయిన్స్ ఒక హిట్టు కొట్టడానికి అల్లాడిపోతున్న మూమెంట్లో రష్మిక ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎలా హిట్స్ కొడుతుంది..?? అంటూ జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.



 కొంతమంది ఆమె పూజలు చేస్తుంది అని దానికి ఫలితంగానే ఇలా హిట్స్ కొడుతుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు.  కొంతమంది ఏకంగా గతంలో రష్మిక మందన్నా  వేణు స్వామి చేసిన పూజలను మళ్లీ హైలెట్ చేస్తున్నారు . వేణు స్వామి పూజలు చేసి మంత్రించి ఏదైనా వస్తువు ఇచ్చారేమో.. అది ఇంట్లో పెట్టుకుందేమో .. ఆ కారణంగానే ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతుందేమో .. లేకపోతే ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా అన్ని సినిమాలు హిట్ అవ్వడం ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు.  మరికొందరు మాత్రం రష్మిక టాలెంట్ ఉన్న అమ్మాయి అని .. సొంత టాలెంట్ తో పైకి ఎదగడానికి చూస్తుంది అని .. మంచి మంచి కథలు చూస్ చేసుకుంటూ ఉంటుంది ..అందుకే హిట్స్ పడుతున్నాయ్..ఎందుకు లేనిపోని రాద్ధాంతం అంటూ రష్మిక కి సపోర్ట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో  ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . దీంతో మరొకసారి తెరపైకి వేణు స్వామి - రష్మిక చేసిన పూజ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: