ఇండస్ట్రీలో చాలామంది బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా హీరోలకు కూతుర్లుగా.. మనవరాళ్లుగా నటించి అదే హీరోలతో మళ్ళీ హీరోయిన్స్ గా చేసిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి బాలనటి గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అనేక చిత్రాల్లో చేసింది. అదేవిధంగా వెంకటేష్ కు కూడా శ్రీదేవి కూతురుగా నటించి ఆ తర్వాత ఆయనతో హీరోయిన్ గా చేసింది. మరి ఆ మూవీ ఏంటి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 1972లో వచ్చినటువంటి  వసంతమాలిగై అనే సినిమాలో శ్రీదేవి చిన్న పాప పాత్రలో నటించింది. 1971లో తెలుగులో వచ్చిన ప్రేమా నగర్ అనే సినిమాకి ఈ చిత్రం రీమేక్. ఇందులో శివాజీ గణేషన్ హీరోగా నటించి అతని సోదరుడి పాత్రలో విజయ్ నటించారు. ఇందులో వెంకటేష్ కూడా బాల నటుడిగా ఒక పాత్ర పోషించారు. వెంకటేష్ విజయ్ కి చిన్న తమ్ముడి క్యారెక్టర్ పోషించగా, విజయ్  కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే ఇందులో శ్రీదేవికి బాబాయ్ పాత్రలో  వెంకటేష్ చేశారు.. ఈ విధంగా బాబాయి కూతురు పాత్ర చేసిన వెంకటేష్ శ్రీదేవి లు  19 ఏళ్ల తర్వాత  1991లో క్షణక్షణం సినిమాలో వెంకటేష్ తో  శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. 
ఈ సినిమాకి రాంగోపాల్ వర్మ డైరెక్షన్ చేయగా ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ఈ విధంగా వెంకటేష్ తో శ్రీదేవి కూతురుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా చేయడం విశేషం.. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివేవి పట్టించుకోరు. సొంత వదినలతో రొమాన్స్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఒకసారి కెమెరా ముందు నటించాలంటే వాళ్ళు వరుసకు ఏమవుతారు అనేది కూడా ఇండస్ట్రీలో అంతగా పట్టించుకోరు.అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో కూతురు వరుసున్న హీరోయిన్ తో వెంకటేష్ రొమాన్స్ చేశారు అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: