
ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే . ప్రజెంట్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఇది మొత్తం సైన్స్ ఫిక్షన్ ఫిలింగా తెరకెక్కబోతున్నట్లు అందరికీ తెలిసిందే . అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ గురించి రోజుకొక న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని..ముగ్గురు కూడా కత్తిలాంటి ఫిగర్స్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అందులో ఒకరు దీపిక పదుకొనే అంటూ అఫీషియల్ గా ప్రకటించేసాడు అట్లి. దీంతో సినిమా రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది .
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది . ఈ చిత్ర తొలి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కాబోతుందట . అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది . ఆల్రెడీ అల్లు అర్జున్ ముంబై కి కూడా చేరుకునేసాడు . అల్లు అర్జున్ రోల్ ఈ సినిమాలో ఎంతో పవర్ఫుల్ గా ఉండబోతుందట . అయితే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ - అట్లీ బృందం ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నారట. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని ఒక ఇంటర్నేషనల్ లొకేషన్ ని చూస్ చేసుకున్నారట అట్లి.
అక్కడే ఒక హై ఓల్టేజి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ . అక్కడే దీపిక పదుకొనే అల్లు అర్జున్ పై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారట. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో - హీరోయిన్ అక్కడ స్పెషల్ లొకేషన్ లో రొమాన్స్ చేసిన పాటలు లేవు . ఇది కచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేక్స్ర. అంతేకాదు ఈ సినిమాల్లో కొన్ని పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటును కూడా సంప్రదిస్తున్నారని టాక్ . దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి..!